Header Banner

ఫ్రీగా విమానం వస్తుంటే వదులుకోవడానికి తెలివితక్కువ వాడినా? ఈ బహుమతి ద్వారా..

  Tue May 13, 2025 22:12        U S A

ఖతార్ రాజ కుటుంబం నుంచి విలాసవంతమైన బోయింగ్ 747-8 జంబో జెట్‌ను బహుమతిగా అందుకోనున్న విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ బహుమతిని స్వీకరించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ఉచితంగా వస్తున్న ఖరీదైన విమానాన్ని కాదనడం అవివేకమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ బహుమతి ద్వారా ఖతార్‌కు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయన్న వాదనలను, అలాగే భద్రతాపరమైన ఆందోళనలను ట్రంప్ తోసిపుచ్చారు. "ఇలాంటి ప్రతిపాదనను నేను ఎప్పటికీ తిరస్కరించను. ఉచితంగా వస్తున్నప్పుడు వద్దనడానికి నేనేమైనా తెలివితక్కువవాడినా?" అని ఆయన ప్రశ్నించారు. తన అధ్యక్ష పదవీకాలం ముగిశాక ఈ విమానాన్ని వ్యక్తిగతంగా ఉపయోగిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. దీనికి బదులుగా డబ్బు చెల్లించాలా? అంటూ ఎదురు ప్రశ్నించారు. భవిష్యత్తులో ఈ విమానాన్ని అధ్యక్ష లైబ్రరీ ప్రదర్శనశాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు, విమానం ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఖతార్ ప్రతినిధి స్పందించారు. తాత్కాలికంగా ఒక విమానాన్ని బదిలీ చేసే అంశం మాత్రమే చర్చల్లో ఉందని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #Indian #Gold #AmericaWomen #Fakejewellery #Rajasthanica